ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దివాకర టీ.ఎస్.
ఖమ్మం, ఏప్రిల్ 27(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కలెక్టర్ గా దివాకర టి.ఎస్. సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దివాకర టి.ఎస్. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ను అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి, డిఆర్‌ఓ పద్మశ్రీ, ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ ల పర్యవేక్షకులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.






