28 April, 2026 | 3:07 AM

ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి చెక్కు అందజేసిన ఎస్పీ రోహిత్ రాజు

28-04-2026 01:22 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27, (విజయక్రాంతి): జిల్లా ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వరస్తూ గుండెపోటుతో ఇటీవల మరణించిన ఏఆర్‌ఎస్త్స్ర ప్రకాశరావు కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో చెక్కు రూపంలో 1,00,000/-(లక్ష రూపాయల) నగదును అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.మరణించిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,జిల్లా కార్యాలయ ఏవో మంజ్యా నాయక్,సూపరింటెండెంట్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.