పలు రైళ్ల దారి మళ్లింపు
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న దృష్ట్యా పలు రైళ్లను దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో 38 రైళ్లను దారి మళ్లించగా, ఇందులో సికింద్రాబాద్ దానాపూర్ (03226)ను ఈ నెల 16, 23, 30 తేదీల్లో ఇటార్సి, బినా, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్ మీదుగా, దానాపూర్ సికింద్రాబాద్ (03225)ను ఈ నెల 20, 27వ తేదీల్లో ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, బినా, ఇటార్సీ మీదుగా దారి మళ్లిస్తున్నట్టు వివరించారు. సికింద్రాబాద్ దానాపూర్ (07419)ను ఈ నెల 15, 27, 29 తేదీల్లోనూ ఇటార్సి, బినా, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్ మీదుగా, దానాపూర్ సికింద్రాబాద్ (07420) రైలును ఈ నెల 17, 24 తేదీల్లో ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, బినా, ఇటార్సీ మీదుగా దారి మళ్లిస్తున్నట్టు వెల్లడిచారు.






