30 June, 2026 | 8:12 AM

స్వాగత్ ప్రైడ్ రెస్టారెంట్‌లో తనిఖీలు

13-06-2024 01:41 AM
  • హోట్‌ల్‌లోఫుడ్ శాంపిల్స్ సేకరించిన అధికారులు

యాజమానికి నోటీసులు 

మంచిర్యాల, జూన్ 12 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని స్వాగత్ ఫ్రైడ్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వాసు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 10న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘కుళ్లిన ఎగ్ మంచూరియా డెలివరీ!’ పేరిట ప్రచురితమైన కథనానికి స్పందించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్.. బుధవారం రెస్టారెంట్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫ్రిడ్జ్‌ల్లో ఉన్న, బయట ఉన్న ఆహారాన్ని,  అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో ఉంచిన ఫుడ్ ఐటం శాంపిళ్లను సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. రెస్టారెంట్‌లో శుభ్రత పాటించకపోవడం, చెడిపోయిన ఆహారాన్ని నిల్వ ఉంచడం తదితర అంశాలపై హోటల్ యాజమానికి నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఎవరినైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

నిల్వ ఉంచిన మాంసం వాడితే జైలుకే

నాగర్‌కర్నూల్, జూన్ 12 (విజయక్రాంతి): హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని వాడితే హోటల్ యజమానులు జైలుకెళ్లడం ఖాయమని ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి మనోజ్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శుభం రెస్టారెంట్, చిల్లీ, బర్గర్ కింగ్ బేకరీ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిర్యానీల కు వినియోగించే మాంసం ఫ్రిజ్‌లల్లో దాచి ఉంచారా లేదా అని వివరాలను సేకరించారు. కాలం చెల్లిన తినే ఆహారం, వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, చిరుతిల్లు కాలం చెల్లినవి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.