calender_icon.png 4 July, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతకు గురైన డైవర్షన్ రోడ్డు

03-07-2025 01:26:59 AM

వలిగొండ,జూలై 2 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద భీమలింగం కాల్వపై వంతెనను నిర్మించేందుకు తాత్కాలికంగా కాలువలో మట్టితో డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డైవర్షన్ రోడ్డు సగం వరకు కోతకు గురైంది. అయితే ఈ డైవర్షన్ రోడ్డు పై నుండి నిత్యం మెగా గ్యాస్ కంపెనీకి చెందిన బరువైన వాహనాలు వెళుతుంటాయి. దీంతో కోతకు గురైన ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉండడంతో వాహనాలు కృంగిపోయే అవకాశం ఉందని అధికారులు వెంటనే స్పందించి కోతకు గురైన ప్రాంతంలో మట్టిని పోయాలని వాహనదారులు కోరుతున్నారు.