08-12-2025 04:03:56 PM
హైదరాబాద్: అభివృద్ధి పెట్టుబడుల విషయంలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరు, హైదరాబాద్ కలిసి ప్రపంచంలో పోటీ పడుతున్నాయని, తర్వాత తరానికి ఏం కావాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిందని కర్ణాటక డిప్యూటీ కొనియాడారు. తెలంగాణ, సౌత్ ఇండియా అభవృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని, దేశ ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు 40 శాతం కలిగి ఉందని డీకే శివకుమార్ తెలిపారు. చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ కూడా గొప్ప వాటా కలిగి ఉందన్నారు. కాలిఫోర్నియా వంటి నగరాల్లో 13 లక్షల భారత ఇంజనీర్లు పని చేస్తున్నారని డీకే శివకుమార్ చెప్పారు.