08-12-2025 03:51:47 PM
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికే అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని కరణ్ అదానీ చెప్పారు. తెలంగాణ విజన్ ను ఈ గ్లోబల్ సమిట్ ప్రతిబింబిస్తోందని, గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నామని కరణ్ పేర్కొన్నారు. సిమెంట్ రంగంలో కూడా అదానీ గ్రూప్ రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టి పరిశ్రమను ఏర్పాటు చేసిందని, అదానీ గ్రూప్ తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్సేస్ పార్క్ ను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.
దేశంలోనే తొలిసారిగా యూఏవీ టెక్నాలజీ హైదరాబాద్ లో రూపొందిస్తున్నామని, తయారయ్యే యూఏవీలను సైన్యానికి అదిస్తామని కరణ్ ప్రకటించారు. రూ.25 వేల కోట్లతో 48 మె.వా. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని, లాజిస్టిక్స్ లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు అదానీ గ్రూప్ యత్నిస్తోందని కరణ్ వెల్లడించారు. అలాగే రూ.4 వేల కోట్లతో రాష్ట్రంలోని జిల్లాలను కలిపే రహదారి సౌకర్యాలను అదానీ గ్రూప్ నిర్మిస్తోందన్నారు.