calender_icon.png 12 December, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్‌సీలను తనిఖీ చేసిన డీఎంఅండ్‌హెచ్‌ఓ

10-12-2025 01:43:20 AM

చెన్నూర్, డిసెంబర్ 9 : చెన్నూర్ నియోజక వర్గంలోని కుందారం, కోటపల్లి పీహెచ్సీలతో పాటు వేమనపల్లి పీహెచ్సీలను మంగళ వారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలలో ఆరోగ్య కార్యక్రమాలు, అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

వంద శాతం గర్భవతులు నమోదు, టీకాలు ఇప్పించడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అసంక్రమణ వ్యాధులు, వాటి గుర్తింపు, చికిత్సలు, కీటక జనిత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.

అనంతరం జీపీ సాధారణ ఎన్నికలలో పాల్గొనే వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించి ఫస్ట్ ఎయిడ్ కిట్ లను అందజేశారు. డీఎం అండ్ హెచ్‌ఓ వెంట డిపిఓ ప్రశాంతి , సబ్మిట్ అధికారి శ్రీనివాస్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ తదితరులున్నారు.