10-12-2025 01:42:01 AM
అంతర్జాతీయ మార్షల్ ఆరట్స్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం
మంచిర్యాల, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కెనడాలోని టోరంటోలో ఈ నెల నాలుగు నుంచి ఆరో తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ మార్షల్ ఆరట్స్ చాంపియన్ షిప్లో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డాక్టర్ పఠాన్ జమీల్ ఖాన్ బంగారు పతకం సాధించారు.
ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల నుంచి 2000 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ తరఫున 50 ఏండ్ల విభాగంలో పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించారు. జమీల్ ఖాన్‌ను జిల్లా ప్రజలు, మార్షల్ ఆరట్స్ క్రీడాకారులు అభినందించారు.