10-12-2025 01:44:34 AM
మాజీ ఎమ్మెల్యే జి విట్టల్‌రెడ్డి
తానూరు, డిసెంబర్ 9 (విజయక్రాంతి): బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భామిని తండా గ్రామానికి ఏకగ్రీవం గా సర్పంచ్‌గా ఎన్నుకోబడిన రోహిదాస్, వార్డు సభ్యులు మంగళవారం మాజీ ఎమ్మె ల్యే జి విట్టల్‌రెడ్డిని కలుసుకున్నారు.
ఈ సం దర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. నూ నంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి గ్రామ అభివృద్ధికి నిరం తరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ ఎండి ఫారుక్ అహ్మద్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, నాయక్ ఆర్ పుండలిక్, ఉపసర్పంచ్ జాదవ్ అమర్ సింగ్, కారోబార్ అప్పారావు, డావు జాదవ్ మాన్సింగ్ పాల్గొన్నారు.