16-07-2025 12:45:45 AM
మంచిర్యాల, జూలై 15 (విజయక్రాంతి): పట్టణంలోని హమాలి వాడా బస్తీ దవాఖానను మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, కీటక జని త వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నందున వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రజలలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల పైన, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కల్పించాలని కోరారు.
ప్రతి ఆరోగ్య మహిళా కార్యక్రమం లో భాగంగా స్త్రీలలో వ్యాధుల గురించి, జీవనశైలి గురించి తెలియజేయాలని ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమ్య, నర్సింగ్ ఆఫీసర్, డెమో బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.