మంచి పనులు చేసి మన్ననలు పొందండి
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
బెజ్జూర్, డిసెంబర్15(విజయ క్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి అభ్యర్థులను సోమవారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపొందిన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు గెలుపొందడమే కాకుండా ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు.
సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సిర్పూర్ నియోజకవర్గంలో 42 మంది సర్పంచుల గెలుపుకు కృషిచేసిన కార్యకర్తలకు ,నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






