16-12-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి విస్తృత ప్రచారం
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 15(విజయక్రాంతి): రెబ్బన మండలంలోని ఖైరిగాం, గంగాపూర్, లక్ష్మీపూర్, నంబాల, ఖైరిగూడ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మె ల్యే కోవ లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన కల్యాణ లక్ష్మి, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మళ్లీ రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ప్రజలకు పూర్తి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థులు ముంజం రూ పేశ్వర్, నగోశ్ విలాస్, దుర్గం కమలబాయిశివాజీ, కొలె శ్యామ్రావు, ఎర్రవేని వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.