calender_icon.png 17 December, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కోసం కష్టపడి పని చేయాలి

16-12-2025 12:00:00 AM

మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్, డిసెంబర్ 1౫ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో  నూతనంగా ఎన్నుకున్న విజేతలు గ్రామాల అభివృద్ధికి ప్రజలను, అధికారులను సమన్వయం చేసుకుని కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.

నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామం నూతనంగా ఎన్నుకున్న మాధస్తు భీంరావు, న్యూ ముజిగి గ్రామంపొలాస శ్రీనివాస్, ముక్తాపూర్ గ్రామం మాన్పూరి  రమేష్, భాగ్యనగర్ గ్రామం జాదవ్ గంగు బాయి, సోన్ మండలం సిద్ధలకుంట సతీష్ రెడ్డి,  సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) వనెల సాయన్న, దిలావర్ పూర్ మండలం అంజనీ తండా రాథోడ్ శ్రీనివాస్  సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన వై.రమేష్‌రెడ్డి  నర్సాపూర్ మండలం నర్సాపూర్ గ్రామ గండం ఇంద్రకరణ్ రెడ్డి ,  సారంగాపూర్ మండలం బొరిగం గ్రామం బొబ్బిలి గోదావరి చించోలి (ఎం) గ్రామం , దాసరి విజయ లక్ష్మణ్,   కోట్ల (బి) అజయ్, సోన్ మండలం సోన్ గ్రామం కృష్ణ ప్రసాద్ రెడ్డి ,  కడ్తాల్ గ్రామం బర్మా రాము,  సారంగాపూర్ మండలం, గ్రామం కోనేరు భూమన్న  దిలావర్ పూర్ మండలం, గ్రామం పాల్దే అక్షర అనిల్, లంగాడాపూర్ గ్రామం నిర్మల్ మండ లం  కొండూరు ప్రశాంత్, వెంగవాపేట్  వని త పాకపట్ల సర్పంచ్ లత వార్డు మెంబెర్స్‌ను సోమవారం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా సన్మానం చేశారు. వీరితో పాటు మాజీ సర్పంచ్, నాయకులు ఉన్నారు.