ఇంటర్ ఫలితాలపై తప్పుడు వార్తలు నమ్మొద్దు!
10-04-2026 01:04 AM
- షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు
- ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలలో జరుగు తున్న ప్రచారాన్ని విద్యాశాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని పేర్కొంది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ‘ఫ్యాక్ట్‌చెక్ విభాగం’ ఎక్స్‌లో గురువారం ఓ పోస్టు పెట్టింది. ‘ఇంతకుముందు కూడా ఎప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదు. మూల్యాంకన సమయాన్ని బట్టి, ఫలితాల విడుదల ప్రకటిస్తామని, ఈ విషయంలో విద్యాశాఖ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మవద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది.




