అవినీతి, భూకబ్జాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
- అవినీతిపై త్వరలో ప్రధానిని కలిసి సీపీఐ విచారణ జరిపిస్తాం
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్,ఏప్రిల్ 9(విజయక్రాంతి): రాష్ట్రంలో భూకబ్జాలు, అవినీతి విచ్చలవిడిగా హద్దు పద్దు లేకుండా పెరిగిపోయిం దని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. త్వరలో ప్రధానిని కలిసి సిబిఐ విచారణ జరిపిస్తాం అని పేర్కొన్నారు. భూకబ్జాలను అరి కట్టవలసిన ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు.
ఈ మేరకు గురు వారం విద్యానగర్లోని బీసీ భవన్ లో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయ నాయకులు ముఖ్యంగా పదవులలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, మాజీ మంత్రు లు, మాజీ ఎమ్మెల్యేల అక్రమాస్తులపై వారి హయంలో జరిగిన అధికారం దుర్వినియో గం, అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇంత అవినీతి జరుగుతున్న కొందరు మంత్రులు కొందరు అధికారులు వేల లక్షల కోట్లు అక్రమా ఆస్తులు సంపాదిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రతిపక్షలు ప్రత్యేక్ష పాత్ర పోషిస్తున్నారే తప్ప దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరడం లేదన్నారు.
అందుకే త్వరలో ప్రధానమంత్రిని కలిసి సిబిఐ విచారణ కోరన్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభు త్వంలో నలుగురు మంత్రులు, కొందరు ఐఏఎస్ అధికారులు కలెక్టర్లు కుమ్మక్కై రాష్ట్రాన్ని లూటి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభివృద్ధి, సంక్షే మాన్ని గాలికి వదిలేసి, విద్యార్ధులకు ఫీజు లు, స్కాలర్ షిప్‌లు ఇవ్వడం లేదన్నారు. బిసి హాస్టళ్ళు, గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించడం లేదని అన్నారు.




