30-12-2025 08:25:05 PM
13 స్ట్రక్చర్ సమావేశంలో జీఎం రాధాకృష్ణ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో కార్మిక సంఘాల కృషి అత్యంత కీలకమైనదనీ మందమర్రి జీఎంఎస్ రాధాకృష్ణ అన్నారు.మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అధ్యక్షతన మంగళవారం గుర్తింపు సంఘం (ఏఐటియుసి) యూనియన్ తో 13వ స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. సింగరేణికార్మికుల పలు సమస్యలపై ఈ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటియుసి) మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, ఏఐటియుసి, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఏఐటియుసి లీడర్లు పాల్గొన్నారు.
జీఎం ఎన్ రాధాకృష్ణ, మాట్లాడుతూ... సంస్థ అభివృద్ధిలో ఉత్పత్తి ఉత్పాదకత లో కార్మిక సంఘాల పాత్ర చాలా కీలకమైనదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత లోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి కూడా ఎక్కువ ప్రదాన్యతను ఇస్తుందన్నారు. గడిచిన సమావేశంలో జరిగిన పనుల పురోగతి గురించి చర్చించారు. ఈ సందర్భంగా జి.ఎం.ఎన్ రాధాకృష్ణ గుర్తింపు సంఘం నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు, ఇప్పటి వరకూ ఉత్పత్తి లక్ష్య సాధనలో ఎలా సహకరించారో ఇక ముందు కూడా సహకరి చాలని కోరారు.
సమావేశంలో ఎస్ఓ టు జిఎం జీఎల్ ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, కెకె గ్రూప్ ఏజెంట్ రాంబాబు, కేకేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఏరియా ఇంజనీర్ E & M బాలాజీ భగవతి జ, డీజీఎం ఐఈడి కిరణ్ కుమార్, ఏరియా స్టోర్స్ డీ.జీ.ఎంఈ అండ్ ఎం.సురేష్, సివిల్ ఎస్ఇ రాము, రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ డివైసీఎంవో ఎం.మధు కుమార్, కే.కే డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, డి.వై.పి.ఎం సందీప్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్అలీ ఏఐటియుసి మందమర్రి వైస్ ప్రెసిడెంట్ సుదర్శనం, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్, ఏఐటీయూసీ స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సి.వి రమణ, సీనియర్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.