ప్రభుత్వ పాఠశాలలను మూసివేయొద్దు
- నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
- ముఖ్యమంత్రికి విద్యావేత్తల బహిరంగ లేఖ
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను విద్యావేత్తలు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశం లో 100 మందికి పైగా మేధావులు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేసి, గ్రామీణ ప్రాంతాల్లోని 23 వేల పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ప్రముఖ పాత్రికేయులు కే.రామచం ద్ర మూర్తి, నాక్ మాజీ చైర్మన్ వి.ఎస్. ప్రసా ద్, మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్, ఆర్థికవేత్త డి.నరసింహా రెడ్డి, మాజీ కేంద్ర సమా చార కమిషనర్ మాడభూషి శ్రీధర్, హైకో ర్టు సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, కవి-రచయిత నందిని సిద్ధారెడ్డి, ప్రొఫె సర్లు జి.హరగోపాల్, కే.చక్రధర్‌రావు, కే.లక్ష్మీ నారాయణ తదితరులు మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలల మూసివేత విద్యా హక్కుకు విరుద్ధమని, విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహించే చర్యగా అభివర్ణించారు.
ఈ సమావేశంలో వనమాల, సయ్యద్ రఫీక్, శంకర్, అ న్వర్ ఖాన్, అనిల్ కుమార్, సోమయ్య, లింగారెడ్డి, రాఘవాచారి, అశోక్ కుమార్, రఘు శంకర్ రెడ్డి, మహేష్, ఏ.విజయ్, శ్రీనివాస్, ప్రకాష్ రావు, బి.ముత్యాలు, విజయ్ కుమార్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.






