8 July, 2026 | 1:53 AM

పాటిగడ్డ-రసూల్‌పుర జంక్షన్ ఫ్లైఓవర్ రూట్ మ్యాప్ మార్పు

08-07-2026 12:00 AM
  1. డాక్టర్ కోట నీలిమను సన్మానించిన పాటిగడ్డ ప్రజలు
  2. అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్, జూలై 7 (విజయక్రాంతి): పాటిగడ్డరసూల్పుర జంక్షన్ ప్రతిపాదిత ఫ్లైఓవర్ రూట్ మ్యాప్ను ప్రజలకు నష్టం కలగకుండా మార్చించడంలో కీలక పాత్ర పోషించిన పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమను పాటిగడ్డ కాలనీ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానికులు శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పాటిగడ్డ కాలనీ ప్రజలు మాట్లాడుతూ తమ సమస్యను తన సమస్యగా భావించి మొదటి నుంచే ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఫ్లైఓవర్ రూట్ మ్యాప్ మార్పునకు కృషి చేసిన డాక్టర్ కోట నీలిమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ ఫ్లైఓవర్ మొదట ప్రతిపాదించిన మార్గం అమలైతే అనేక ఇళ్లు, వందలాది కుటుంబాలు, అలాగే వారసత్వ, చారిత్రాత్మక కట్టడాలు ప్రభావితమయ్యే పరిస్థితి ఉండేదని తెలిపారు.

ఈ విజయంలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్తో పాటు సంబంధిత అధికారులకు డాక్టర్ కోట నీలిమ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, కాలనీ పెద్దలు, మహిళలు,యువకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.