2 May, 2026 | 1:53 AM

విచారణలోనే తీర్పు ఇవ్వొద్దు!

02-05-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ వర్గీకరణ, నియంత్రణ, అప్పీల్ నిబంధనలు 1991 నందు సస్పెన్షన్, పెనాల్టీస్, ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్, ఇంక్వైరీ అథారిటీ, ప్రజెంటింగ్ ఆఫీసర్ నియామకం వారి విధులు విధివిధానాల గురించి క్షుణ్ణంగా వివరించారు. అయినప్పటికీ చాలామంది ఉద్యోగులు, అధికారులకు ఈ విషయాలపై సరైన అవగాహన లేక అనుసరించవలసిన పద్ధతుల్లో తప్పిదాలు జరిగి ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించినప్పుడు, ఆ లోపాలపై అధికారులను తప్పుబట్టడం జరుగుతున్నది.

అట్లాగే సరైన పద్ధతులు పాటించకపోవడంతో చాలా సంవత్సరాలు ఆయా కేసులపై నిబం ధనల మేరకు విచారణ నిర్ధారించిన సమయంలో పూర్తిచేయకపోవడంతో ఉద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. గత వారం విచారణాధికారి నియామకం, ప్రజెంటింగ్ అధికారి నియామకం, అనుసరించవలసిన పద్ధతులు, వారి విధుల గురించి వివరించడమైనది. వీటిలో అతి ముఖ్యమైన దోషారోపణ పత్రాలు తయారు చేయడంలో ఉండవలసిన అంశాలు, అట్లాగే విచారణ అధికారి నివేదికలో స్పష్టంగా ప్రస్తావించదల్చిన అంశాల గురించి వివరిస్తున్నాను.

దోషారోపణ పత్రాలు: 

1. దోషారోపణ పత్రం అనేది ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక సారాంశం. ఇది అక్రమంగా ప్రయోజనాలు పొందడం, నాసిరకం పనిని అంగీకరించడం, పనికొలతను తప్పుగా నమోదు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం లేదా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం వంటి ఆరోపణల స్వభావాన్ని సాధారణ పదాలతో వివరిస్తుంది. ఆరోపణ అనేది జరిగిన దుష్ప్రవర్తనను, ఉల్లంఘించిన నియమాలను క్లుప్తంగా, స్పష్టంగా, కచ్చితంగా గుర్తించాలి.

ప్రభుత్వ ఉద్యోగి తన ప్రమేయం గురించి స్పష్టమైన అవగాహన ఉండేలా సమయం, స్థలం, వ్యక్తులు, వస్తువుల వివరాలను తెలియజేయాలి. ఇందులో అస్పష్టతకు తావు లేదు. పూర్తిగా స్పష్టంగా ఉండాలి. 2. దోషారోపణ పత్రాలు ప్రధానంగా ఉత్తమ పురుష (థర్డ్ పర్సన్)లో ఉండాలి. 3. ప్రతి లావాదేవీ/ సంఘటన లేదా సంబంధిత సంఘటన శ్రేణికి సంబంధించి విడివిడిగా దోషారోపణ పత్రాన్ని రూపొందించాలి.

4. ఒకే లావాదేవీ సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ తప్పులు జరిగినట్లయితే ప్రతి తప్పును ప్రత్యేకంగా పేర్కొనాలి. 5. ఒక సంఘటనను బట్టి ప్రభుత్వ ఉద్యోగి ఒక రకమైన లేదా మరొక రకమైన తప్పునకు బాధ్యుడయ్యే అవకాశం ఉంటే ఆరోపణను ప్రత్యామ్నాయంగా పేర్కొనవచ్చు. 6. ఒకే ఆరోపణ ఆధారంగా దోషారోపణలను అనవసరంగా పెంచడం లేదా విభజించడం చేయకూడదు. 7. నిందితుడు (డిఫాల్టర్/ అక్యూస్డ్) వంటి పదాలు ముందస్తు తీర్పును సూచిస్తాయి. కాబట్టి, అలాంటి పదాలు తగవు.

వాటికి బదులుగా ప్రభుత్వ ఉద్యోగి లేదా సిబ్బంది వంటి పదాలను ఉపయోగించాలి. 8. ఆరోపణ పత్రంలో ప్రభుత్వ ఉద్యోగి దోషి అనే అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదు. ఇది ఒక ఆరోపణ మాత్రమే తప్ప, ముగింపు కాదని తెలియజేయడానికి వాక్యం that అనే పదంతో ప్రారంభం కావాలి. 9. సాంకేతిక కారణాలు ఉంటే తప్ప ఇప్పటికే విచారణ, తీర్పు పూర్తయిన విషయానికి సంబంధించి మళ్లీ ఆరోపణ చేయకూడదు. 10. దోషారోపణ పత్రాలలో లేదా ఆరోపణ వివరణలో విధించబోయే శిక్ష గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. 

విచారణాధికారి నివేదిక:

విచారణ అధికారి ఇచ్చే నివేదికలో ఈ కింది అంశాలు ఉం డాలి: 1. ఇందులో ఒక వాక ్యం లేదా పేరా విచారణ అధికారి నియామకానికి సంబంధించిన వివరాలు, విచారణ జరిగిన తేదీలు, ప్రదేశాల గురించి ప్రస్తావించాలి. 2. మోపబడిన అభి యోగాలు, సదరు దుష్ప్రవర్తన లేదా తప్పుడు ప్రవర్తనకు సం బంధించిన ఆరోపణల వివరా లు. 3. ప్రతి ఆరోపణ అంశం పై కనుగొన్న విషయాలు, అందుకు గల కారణాలను కచ్చితం గా పొందుపరచాలి. 

వ్యాసకర్త: రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

మనోహర్‌రావు చిలప్పగారి