17-06-2025 08:53:17 PM
హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్..
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్(CI Macha Sivakumar) మాట్లాడుతూ... హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆటో డ్రైవర్లను పోలీస్ స్టేషన్ కి పిలిపించి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, అంతరాయం కలగకుండా చూడాలని అందరూ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, వెహికల్ ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, మద్యపానం చేసి వాహనం నడపారాదని, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తూ పోలీసులకు సహకరించాలని చెప్పడం జరిగింది.