24 May, 2026 | 8:03 PM

గుర్తింపు లేని విద్యాసంస్థల్లో విద్యార్థులను తీర్చకండి: ఎంఈఓ

24-05-2026 07:01 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్‌లో ఈ సంవత్సరం ప్రారంభించబడుతున్న  ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ కు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి గానీ గుర్తింపు గానీ లభించలేదని ఆదివారం మధ్యాహ్నం ఒక పత్రిక ప్రకటనలో  బోధన్ ఎంఈఓ నాగయ్య  తెలియజేశారు. ప్రభుత్వ అనుమతి, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల వివరాలు మండల విద్యా వనరుల కేంద్రం బోధన్  లో నోటీస్ బోర్డ్ పైన ప్రదర్శించడం జరిగిందని. అదేవిధంగా ఆచార్య విద్యాలయ పాఠశాల కు 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ అనుమతి లేనందున, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించగలరని 

 బోధన్ మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు లేదా ఇతర విద్యా సామగ్రి విక్రయాలు నిర్వహించరాదని స్పష్టంగా ఆదేశించబడుచున్నది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోబడును. విద్యార్థుల విద్యా హక్కులను, నాణ్యమైన విద్యను మరియు భద్రమైన విద్యా వాతావరణాన్ని కాపాడుటలో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు సహకరించవలసిందిగా బోధన్ మండల విద్యాధికారి నాగయ్య కోరడమైనది.