3 June, 2026 | 12:36 AM

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు

03-06-2026 12:02 AM
  1. అధికారుల నిర్లక్ష్యంతో కొంత అస్పష్టత
  2. నెలరోజుల్లో పీఆర్సీ తీపి కబురు
  3. రెండు మూడు రోజుల్లో హెల్త్ కేర్ ట్రస్ట్ ఉత్తర్వులు
  4. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి

కామారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల విషయంలో అపోహలు వద్దని పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర (పీఆర్టీయూ) అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కామా రెడ్డి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. వైద్య సేవలలో పారదర్శకంగా ఉంటుందని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సేవలు అందుతాయని చెప్పారు. అధికారులు కొంత అస్పష్టంగా, సకాలంలో వివరాలు వెల్లడించకపోవడం వల్ల అనుమానాలను రేకెత్తించాయన్నారు.

సీఎస్‌తో రామకృష్ణారావుతో హెల్త్ కార్డుల విషయంలో చర్చించామని, ప్రభుత్వం  ఉన్నదన్నారు. రాష్ర్టంలో లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని నెలలోపు పే రివిజన్ కమిషన్ వస్తుందని వెల్లడించారు. ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఊ.12 వేల కోట్లు బకాయి ఉందని, వాటిలో ఇప్పటివరకు ౩ కోట్లు విడుదల చేసింద న్నారు. పాత పద్ధతిలోనే పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం సానుకూలతను వ్యక్తం చేసింద న్నారు.   

మూడు రోజుల్లో హెల్త్ కేర్ ట్రస్టు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేయనున్నారని తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరికీ వైద్య సేవల విషయంలో ఇతర ముఖ్యమైన  విషయంలో  ఇద్దరిలో ఒకరికి ప్రభుత్వ సాయం అందుతుందని సీఎస్ స్పష్టం చేశారని వెల్లడించారు.

మే నెల కు సంబంధించిన 1.5 శాతం హెల్త్ కార్డు కోసం వేతనాల నుంచి కోత విధించారని భార్యాభర్తలు ఉంటే ఒకరివి మాత్రమే ప్రభుత్వానికి జమ చేస్తారని, ఒకరిది మళ్లీ వారి ఖాతాలో జమ చేస్తారన్నారు. జూన్ 10న  రిఫరల్ హాస్పిట ల్స్ జాబితా వెల్లడిస్తారని తెలిపారు. నెల రోజు ల్లో పిఆర్సి ప్రకటన వస్తుందని చెప్పారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్కర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా బాధ్యులు గోవర్ధన్, హనుమాన్లు, బాపురెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు.