30 July, 2026 | 11:45 PM

విత్తనాలు, ఎరువుల సమస్య రావొద్దు

18-06-2024 04:16 AM
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జూన్ 17: వర్షాకాలంలో వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం, విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, విద్యా, వైద్యం, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, చెరువుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.