31 July, 2026 | 12:39 AM

అడ్డూ అదుపు లేకుండా గోవుల రవాణా

18-06-2024 04:12 AM
  • వీహెచ్‌పీ ప్రతినిధులు

మెదక్, జూన్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో గోవుల రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోందని, ఇందుకు ప్రభుత్వం మద్దతు పూర్తిగా ఉందని.. ఆవు గోస పాపం ఈ ప్రభుత్వానికి తగులుతుందని విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ మఠ మందిర్ ప్రముఖ్ మూసాపేట రామరాజు, రాష్ట్ర సంపర్క ప్రముఖ్ వెంకటేశ్వర రాజు విమర్శించారు. రెండు రోజుల క్రితం మెదక్‌లో జరిగిన అల్లర్లపై, గోవుల రవాణాపై స్పందిస్తూ సోమవారం మెదక్‌లోని శ్రీమా త బోరంచమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

రాష్ట్రంలో గోవుల రవాణా అరికట్టడా నికి చెక్‌పోస్టులు పెట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా, వేలాది ఆవులు ఎందుకు వస్తున్నా యని ప్రశ్నించారు. మెదక్‌లో జరిగిన అల్లర్ల కు పోలీసుల ఫెయిల్యూరే కారణమని, హిందూ చట్టాన్ని కాపాడమంటున్న వారిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంఐఎం కనుసన్నల్లో పాలన సాగుతోందని ఆరోపించారు. పోలీసులు పట్టుకున్న గోవులు ఎటు తరలిపోతున్నాయో చెప్పాలన్నారు. మెదక్‌లో జరిగిన అల్లర్లపై స్థానిక ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో సుభాష్ చందర్, పబ్బ సత్యనారా యణ, మల్కాజి సత్యనారాయణ, చెన్న రాంచంద్రం పాల్గొన్నారు.