24 July, 2026 | 1:37 AM

లబ్ధిదారులపై ఆర్థిక భారం మోపొద్దు

24-07-2026 12:27 AM
  1. ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
  2. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచి తంగా ఇళ్లను అందించాలే తప్ప, లబ్ధిదారులపై ఆర్థికభారం మోపే విధానాన్ని అనుసరించవద్దని బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్‌ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, సుర భి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెం కటేష్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి, అత్యంత విలువైన ప్రాం తాల్లోనూ పేదలకు ఉచితంగా అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి 30 నెలలు గడిచినా నగరంలో ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించ లేదని, ఇళ్ల పేరుతో ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షలు ఇస్తూ, మరో రూ.6 లక్షలు లబ్ధిదారులే భరించాలని చెప్పడం అన్యాయమన్నారు.