ఓటు హక్కును కాపాడుదాం
బైంసా జూలై 23 (విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే బి నారాయణరావు పటేల్ అన్నారు. భైంసాలో గురువారం ఎస్‌ఐఆర్ పై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరు తమ ఓటు హక్కు కోల్పోకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఎస్ ఐ ఆర్ దరఖాస్తులను పూర్తి చేయడంలో బిఎల్వోలుకు వాటిని అందజేయడంలో పూర్తి సహకారం అంది దామన్నారు. అర్హత గల ఏ ఒక్కరు ఓటు హక్కును కోల్పోకుండా చూడవలసిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. డిసిసి అధ్యక్షుడు వెడమ బొజ్జు, మాజీమంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు






