26 August, 2026 | 3:40 AM

వైఫల్యాలకు సాకులు చెప్పొద్దు

26-08-2026 12:00 AM

భారత హాకీ జట్లపై పీఆర్ శ్రీజేష్ ఆగ్రహం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 : హాకీ ప్రపంచకప్లో భారత హాకీ జట్ల ప్రదర్శనపై మాజీ గోల్కీపర్ పి.ఆర్.శ్రీజేష్ తీవ్ర ఆగ్ర హం, నిరాశ వ్యక్తం చేశారు. హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల, మహిళా జట్లు సెమీఫైనల్ రేసు నుండి నిష్క్రమించడంపై ప్రశ్నించారు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీని రిహార్సల్గా పరిగణించకూడదని, వైఫల్యాలపై ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.

మనం మంచి హాకీ ఆడేందుకు ఒక జట్టును నిర్మిస్తున్నామా? లేక ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లపై గెలవగల సామర్థ్యం ఉన్న జట్టును నిర్మిస్తున్నామా? అనేది ఆలోచించుకోవాలన్నాడు.ఇకనైనా వైఫల్యాలను దాచిపెట్టడం ఆపేయాలని కోరాడు. మహిళా జట్టు ప్రధాన కోచ్ ప్రపంచకపుకు ముందు సెలవుపై వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.