16 April, 2026 | 3:09 AM

రైతుల భూములను లాక్కో వద్దు!

16-04-2026 01:33 AM
  1. అన్నదాతల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
  2. వికారాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత మెరుపు ధర్నా
  3. గరీబ్‌నగర్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు రైతులుభారీర్యాలీ 
  4. ధర్నాకు విశారదన్ మహరాజ్ మద్దతు
  5. పోలీసుల లాఠీచార్జ్.. కవిత, విశారదన్ అరెస్ట్

వికారాబాద్, ఏప్రిల్- 15 (విజయ క్రాం తి): వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ రైతుల భూములను లాక్కోవ ద్దని, అన్నదాతల సమస్యలపై కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని పరిగి ఆర్డీవో కార్యాలయం ఎదుట కవిత మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాపోల్ రైతులకు డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరా జ్‌తో కలిసి మద్దుతు తెలిపారు.

దీంతో జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపో యింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి, కవితను, విశారధన్‌ను అరస్ట్‌చేశారు. రా పోలు రైతుల సమస్యల పరిష్కారం కోసం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్‌పీ అధ్యక్షుడు విశారధన్‌మహరాజ్ సం యుక్తంగా ఆర్డీవో కార్యాలయం ముందు బుధవారం భారీధర్నా చేశారు.

అయితే కవిత బుధవారం ఉదయమే పోలీసులకు తెలియకుండా వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని గరీబ్‌నగర్‌లో ఓ ఇంట్లో ఉండి మధ్యాహ్నం ఆర్డీఓ కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగే ప్రయత్నం చేశారు. దీంతో గరీబ్‌నగర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు రైతులు భారీర్యాలీ నిర్వహిం చారు. రాపోల్ రైతుల భూములను ప్ర భుత్వం బలవంతంగా తీసుకోవద్దని ఈ ధర్నా చేశామన్నారు. తరువాత ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సుమారు రెండున్నర గంటల పాటు నిరసన కొనసాగడంతో ట్రాఫిక్‌కు తీ వ్ర అంతరాయం ఏర్పడింది.

ధర్నా సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య వాగ్వివా దం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మా రింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ సందర్భంగా కవిత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశా రు. భూసమస్యలు, పంట దిగుబడులకు కనీస మద్దతు ధరలు, సాగునీటి ఇబ్బందు లు వంటి కీలక అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్ స్పందించే వరకు ధర్నాను విరమించబోమని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ సందర్భం గా రైతుల పక్షాన త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు కవిత సంకేతాలు ఇచ్చారు. అనంతరం ధర్మసమాజ్‌పార్టీ (డీఎస్‌పీ) అధ్యక్షుడు విశారద న్‌మహారాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకుందన్నారు.

ప్రభుత్వ భూస్వాముల నుంచి, అక్రమార్కుల నుంచి భూములు తీసుకుని ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేసి, పేదలకు ఉపాధి కల్పించాల్సిన అవస రం ఉందన్నారు. కవితతను, విశారదన్ మహరాజును అరెస్టుచేసిన పోలీసులు బం ట్వారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, రాపో ల్‌ప్రాంత రైతులు, స్థానికులు పాల్గొన్నారు.