23 August, 2026 | 9:09 PM

బడులు పునఃప్రారంభం

13-06-2024 03:12 AM

వేసవి సెలవుల అనంతరం 

బుధవారం బడులు పున:ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్చించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ప్రభుతం కల్పిస్తున్నదని చెప్పారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. 

 -విజయక్రాంతి నెట్‌వర్క్ , జూన్ 12

ఖిలావరంగల్‌లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మేయ ర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ అలుబెల్లి నర్సిరెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య తో కలిసి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుటున్నదన్నారు.

విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపడానికి బడిబాట కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్‌గా మార్చాలనే ఆలోచనలో ఉన్నారని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విద్యా ర్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దేవిసింగ్, మండల కాంగ్రెస్ నాయకులు మల్లికా ర్జున్, జయ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

  1. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్ మండలం మైలారం జిల్లా పరిషత్ పాఠశాలలో కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఈ వో రాంకుమార్, డీఆర్డీవో నరేష్, ఎంపీడీవో భాస్కర్ పాల్గొన్నారు.
  2. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట పాఠశాలలో కలెక్టర్ జి.రవినాయక్‌తో కలిసి నోట్‌పుస్తకాలు, యూ నిఫాంలను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డీఈవో రవీందర్ పాల్గొన్నారు. 
  3. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండ లం ముల్కల్ల, రాపల్లి గ్రామాల్లోని ప్రభు త్వ పాఠశాలల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో డీఈవో యాదయ్య, డీఆర్‌డీవో కిషన్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. 
  4. వనపర్తి గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడమోర్స్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సరిత పాల్గొన్నారు. గోపాల్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పెద్దమందడి మండలంతో పాటు జిల్లా కేంద్రం లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, జడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వేర్వురుగా పాల్గొన్నారు. 
  5. గద్వాల మండలం పరమాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ సంతోష్ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ఖనాపూర్ మండలంలోని మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, డీఈవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఖానాపూర్ మండలంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలను డీఈవో రవీందర్‌రెడ్డి పంపిణీ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని ప్రభుత పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ అందజేశారు.