7 April, 2026 | 3:36 AM

యువత ఓటెత్తేనా..

02-05-2024 01:16 AM

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో 18 ఓటర్లు  65,595

ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా మారనున్న యువ ఓట్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్యంలో ‘ఓటు’ వజ్రా యుదంతో సమానం. ఓటు అనే రెండు అక్షరాలు రాజకీయ నాయకుల జీవితాలను ఉన్నత శిఖరాలకు తీర్చుకెళ్లగలవు. అలాగే తలకిందులుగా కూడా మార్చగలవు. ముఖ్యంగా ఓటర్లందరితో పోల్చితే నిర్ణయాత్మకమైన ఆలోచనా శక్తి యువతదే. కాని నగ రాల్లో ఓట్లు వేసేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా యువత ఓటుపై అనా సక్తిని కనబర్చుతుంది. కాబట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలింగ్‌తో పోల్చితే.. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోనే అత్యల్పం గా నమోదు అవుతుంది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రధానంగా యువ ఓటర్లపై దృష్టి సారించారు. కారణం.. జంట నగరాల పరిధిలో 18 మద్య వయసున్న 65,595 మంది యువ ఓటర్లు ఉండటమే. దేశ భవిష్యత్తును నిర్ణయించే లోక్‌సభ ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీల దృష్టి యువతపైనే ఉంది. వారిని ప్రసన్నం చేసుకుంటే విజయం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

ఓటుపై అనాసక్తి...

చదువుకున్న వాళ్లతో పోల్చితే చదువురాని వయోజనులే ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా యువత ఓటింగ్‌పై దృష్టి పెట్టకుండ, పోలింగ్ నాడు ఎన్నికల కమిషన్ ఇచ్చిన హాలిడేను జాలీడేగా భావిస్తున్నారు. కాగా ఎన్నికల ప్రచా రం, బైక్‌ర్యాలీలతో హల్‌చల్ చేస్తూ పలువురు యువత కనిపిస్తున్నప్పటికీ వారిలో ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది ? ఎంత మంది పోలింగ్‌లో పాల్గొంటున్నారనేది సందేహంగా మారింది. వాస్తవానికి 18ఏళ్లు నిండిన యువతకు మెరుగైన ఆలోచన శక్తి ఉంటుంది. కావున వారికి ఓటు హక్కును కల్పించాలని భారత రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ అర్హత ఉన్నప్పటికీ యువత ఓటును నమోదు చేసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదని పలువురు బూత్‌లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) చెబుతున్నారు. 

పబ్జీపై ఉన్న శ్రద్ధ.. పోలింగ్‌పై ఉండడం లేదు

ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 22,17,094 ఓట్లు ఉండగా, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 23,53, 044మంది ఓటర్లున్నారు. ఈ మొత్తం ఓటర్లలో 30శాతం మంది 40ఏళ్ల లోపు వారే నని అధికారులు అంచనా వేస్తున్నారు. గతం లో ఏ ఎన్నికలు తీసుకున్న హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో పోలిం గ్ 50శాతానికి చేరుకోలేదు. ఈ క్రమంలోనే నగరంలో పోలింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఎన్నికల వేళ ఈ యువ ఓటర్లంతా ఆన్‌లైన్ మత్తులో ఉంటున్నారని పబ్జీ, క్రీడలు, చాటింగ్‌పై ఉన్న  శ్రద్ధ ఓటు వేయడం లేదనేది బహిరంగ రహస్యం. ఈ ఎన్నికల్లోనైనా పోలింగ్‌లో పాల్గొని సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని యువ ఓటర్లకు అధికారులు సూచిస్తున్నా రు. యువత ఓటు వేస్తేనే వారి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.