మోదీ ఇచ్చింది పెద్ద గాడిదగుడ్డు
02-05-2024 01:15 AM
ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర సాయంపై బుధవారం సీఎం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘తెలంగాణ అడిగింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా. కానీ బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. తెలంగాణ అడిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా గోదావరిలో నీటి వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయ హోదా.. కానీ బీజేపీ ఇచ్చింది గాడిదగుడ్డు’ అని మండిపడ్డారు.




