17 April, 2026 | 8:33 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

మీకు పిల్లలున్నారా?

04-05-2025 12:00 AM

ఇద్దరు పిల్లల్ని పెంచేసరికి తల్లిదండ్రులు ఎక్కడలేని ఒత్తిడికి గురవుతారు. ’అమ్మో పిల్లల్ని పెంచడం మామూలు విషయం కాదు.. అంతకు మించిన టెన్షన్ మరొకటి లేదు‘ అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తారు. నిజంగానే పిల్లల్ని పెంచడం అమ్మానాన్నల్లో అంత ఒత్తిడిని పెంచుతుందా అనే విషయంపై యేల్ యూనివర్సిటీ సుమారు నలభైవేలమందిపైన పరిశోధన చేసింది.

ఇందులో తేలిందేమిటంటే.. అందరూ అనుకున్నట్టుగా పిల్లలని పెంచడం అనేది తల్లిదండ్రుల్లో ఎటువంటి ఒత్తిడిని పెంచదు. వాళ్ల మెదడు వృద్ధాప్యం బారిన పడకుండా చురుగ్గా ఉండేందుకు తోడ్పడుతుందట. ఇందుకోసం ఎంపిక చేసుకున్న తల్లిదండ్రుల న్యూరో ఇమేజింగ్ డేటాని తీసుకుని పరిశీలించినప్పుడు.. ఒక సంతానం ఉన్న తల్లిదండ్రులతో పోలిస్తే ఇద్దరూ అంతకన్నా ఎక్కువ పిల్లలున్న వారి మెదడులోని కొన్ని కీలకమైన భాగాలు మరింత చురుగ్గా పనిచేయడం గమనించారు.

నిజానికి పిల్లలు పుట్టిన కొత్తల్లో తల్లుల్లో మతిమరుపు లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ’మమ్మీ బ్రెయిన్‘ అంటారు. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమే అని.. ఆ తర్వాత పిల్లలు పెరిగేకొద్దీ ఆ సమస్యలన్నీ తగ్గిపోవడంతో పాటు మెదడు చురుగ్గా మారుతుందనీ ఈ పరిశోధనలో వెల్లడైంది.