04-05-2025 12:00:00 AM
తప్పులు చేయడం మానవ సహజం అంటారు పెద్దలు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని తెలిసి చేయవచ్చు. మరికొన్ని తెలియకుండా జరిగిపోవచ్చు. అయితే కొంతమంది వీటిని జీర్ణించుకోలేరు. ఉదాహరణకు.. మీ ప్రమేయం లేకుండా, మీ అనుమతి తీసుకోకుండా మీ భాగస్వామి మీ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారనుకోండి.. ఇలాంటప్పుడు అవతలి వ్యక్తిపై కోపం రావడం సహజం.
అలాగని చీటికీ మాటికీ కోపగించుకుంటూ పోతే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అదే ఈ విషయం గురించి భాగస్వామితో నెమ్మదిగా మాట్లాడి చూడండి. తనకు తెలియకుండా తన డబ్బును మీరు వాడితే తను ఎలా ఫీలవుతారో అడిగి చూడండి..
అప్పుడు మీ బాధేంటో వారికి అర్థమవుతుంది. తద్వారా ఆ పొరపాటు మరోసారి చేయకుండా ఉంటారు. ఇదొక్కటనే కాదు.. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు క్షమాగుణంతో వ్యవహరిస్తే.. చాలా సమస్యలు నాలుగు గోడల మధ్యే పరిష్కారమవుతాయి.