6 June, 2026 | 1:46 AM

కళ్లుండి చూడలేదా..? చూసినా కనబడటం లేదా..?

06-06-2026 12:00 AM

బీఆర్‌ఎస్‌పై మండిపడ్డ డిప్యూటీ మేయర్ 

ముకరంపుర, జూన్ 5 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి పనులను ఏడు సంవత్సరాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో అనేక అభివృద్ధి పనులు చేసి చూపించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. శుక్రవారం  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  కరీంనగర్ పార్లమెంట్ పరిదిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతా ఉంటే కళ్ళుండి చూడలేదా... చూసినా కనబడటం లేదా..? అని ప్రశ్నించారు.  బీఆర్‌ఎస్ నాయకులు ఎప్పుడు మాట్లాడినా మా ప్రభుత్వం తీసుకొచ్చిన పనులంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పా... చేసింది ఏం లేదని అన్నారు. 

మా నాయకులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా  ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో కళ్లముందే కనిపిస్తోందని, అలాగే కరీంనగర్ టూ జగిత్యాల ప్రధాన  రోడ్డు 2,395 కోట్ల రూపాయలతో అన్ని రకాల అనుమతులు తీసుకొని, దాదాపు 300 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ కింద పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. పనులు ప్రారంభించడానికి ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉందన్నారు.

2016 లోనే వీటికి అనుమతులు వచ్చాయని బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయం అన్నారు. 2016 నుండి పనులను ఎవరు ఆపారో చెప్పాలని డిమాండ చేశారు.  ప్రతిపాదనలు పంపినంత మాత్రన పనులు కావని అన్నారు. బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నియోజకవర్గానికి అనేక రకాల ప్రాజెక్టులు తెచ్చి... అభివృద్ధిలో ముందుకు పోతుంటే... దాన్ని చూసి జీర్ణించుకోలేక చౌకబారు మాటలు మాట్లాతుతున్నారని ద్వజమెత్తారు.రెండు జాతీయ రహదారులను దాదాపు 6 వేల కోట్ల పై చిలుకు నిధులతో సాధించిన ఘనత  బండి సంజయ్ దన్నారు. త్వరలోనే మంత్రి  నితిన్ గడ్కరీ చేతుల మీదుగా పనులు ప్రారంభం చేసే అవకాశం ఉందని తెలిపారు.

8 వందల కోట్ల సీఆర్‌ఎఫ్ నిధులు తెచ్చి నియోజకవర్గం లోని ప్రధాన రోడ్ల సమస్యల పనులు చేపట్టిన ఘనత బండి సంజయ్ దన్నారు. చొప్పదండి నుండి మల్యాల రోడ్డుకు 50 కోట్ల నిధులతో పనులు ప్రారంభం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో లోయర్ మానేరు డ్యాంలో  గన్నెరువరం నుండి కరీంనగర్ వరకు 70 కోట్లతో అధునాతన వంతెన పనులు ప్రారంభం చేయబోతున్నట్లు తెలిపారు. 150 కోట్ల రూపాయల తో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

కరీంనగర్ నగర అభివృద్ధి కోసం యూసిఎఫ్ కింద 840 కోట్ల రూపాయలు తెచ్చి పనులు జరిపించే ఘనత సంజయ్ కి దక్కిందన్నారు. స్మార్ట్ సిటీ మేం తెచ్చామంటూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని... స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వంద నగరాలకు ఇచ్చిందని... అందులో తెలంగాణ రాష్ట్రం లో కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు దక్కిందన్నారు. నరెంధ్ర మోడి నాయకత్వం లో కేంద్రం నుండి నిధులు విడుదల చేయించి... స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయించిన ఘనత కేవలం బండి సంజయ్ కే దక్కిందన్నారు. వారి నాయకత్వంలో పనులు పూర్తు కరీంనగర్ నగరం సుంధరంగా అభివృద్ధి చెందిందని తెలిపారు.

ఇటీవల కరీంనగర్ కు తెచ్చిన యూసిఎఫ్ స్కీంను కూడ మీమే తెచ్చామంటరో ఏమో అని ఎద్దేవ చేశారు. కరీంనగర్ నగరంలో విలీన శివారు గ్రామాల డివిజన్ల సమస్యలు, డంపుయార్డు సమస్యను పరిష్కరించాలనే గొప్ప ఉద్దేశంతో కేంద్రాన్ని మెప్పించి యూసిఎఫ్ స్కీం నిధులు తెచ్చారని కొనియాడారు. 277 కోట్ల రూపాయల నిధులతో అమృత్ పథకంలో త్రాగు నీటి కొరతను శాశ్వతంగా దూరం చేసి... ప్రజలకు త్రాగు నీరు అందించేందుకు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.

సామాజిక బాధ్యత గా సిఎస్‌ఆర్ స్కీంలో దాదాపు 20 వేల సైకిళ్ళను ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు అందించిన చరిత్ర బండి సంజయ్ దన్నారు.  అభివృద్ధిని ఓర్వలేక, జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ నాయకులు అవకాలు చెవాకులు మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. ప్రజల కళ్ల ముందు ఉన్న వాస్తవాలను గమనించి అభివృద్ధికి సహకరించాలని సూచించారు.  రాబోయే రోజుల్లో ఇలాంటి నిధులు ఏన్నో తెచ్చి... గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటారన్నారు.

ఈ సమావేశంలో 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు,36వ డివిజన్ కార్పొరేటర్ తోట అనిల్, 57వ  డివిజన్ కార్పొరేటర్ కొలిపాక రమ్మ-శ్రీనివాస్,39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్,43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి-మొండయ్య గౌడ్,37వ డివిజన్ కార్పొరేటర్ కె ఎపిపి చంద్ర, కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు..