పచ్చని చెట్లు.. ప్రకృతికి నిలయం..
ఘనంగా పర్యావరణ దినోత్సవం
సత్తుపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన ప్రజాపాలన. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగాన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఫడీసీ) సత్తుపల్లి డివిజన్ ఆధ్వర్యంలో పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడినవి.
ఈ సందర్భంగా సత్తుపల్లిలోని 6వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు కమ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ప్రాంగణంలో ఎం. శ్రీనివాసరావు మేజిస్ట్రేట్, 6వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు కమ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, సత్తుపల్లి ఇతర న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ సత్తుపల్లి డివిజన్ డివిజ నల్ మేనేజర్ మరియు సిబ్బంది సమక్షంలో మొక్కల నాటడం కార్యక్రమం నిర్వహించబడినది.
అనంతరం కార్పొరేషన్ టింబర్ అండ్ బాంబో డిపో, సత్తుపల్లి ప్రాంగణంలో మొక్కల నాటడం కార్యక్రమం నిర్వహించబడినది. తదుపరి పర్యావరణ పరిరక్షణ హరితాభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించుటకు కార్పొరేషన్ టింబర్ అండ్ బాంబో డిపోసత్తుపల్లి నుండి సత్తుపల్లి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పర్యావరణ సైకిల్ ర్యాలీ నిర్వహించబడినది.






