26-05-2025 12:22:00 AM
- ‘గండ దీపం‘ పుస్తకావిష్కరణ
- ప్రముఖ కవి డాక్టర్ అంబటి సురేంద్ర రాజు
ముషీరాబాద్, మే 25 (విజయక్రాంతి): సమాజానికి నాగరికత నేర్పింది విశ్వకర్మ లేని ప్రముఖ కవి డాక్టర్ అంబటి సురేంద్ర రాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం బా గ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విశ్వకర్మ నాలెడ్జి సెంటర్ 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు శ్రీనివాస విశ్వకర్మ ప్రధాన కార్యదర్శి సోలేటి ప్రభాకరాచారి సమన్వయంలో విశ్వనాధుల పుష్పగిరి రాసిన ‘గండ దీపం‘ కవిత్వం పుస్తకావిష్కరణ నిర్వహించారు. విశ్వకర్మ యంగ్ లీడర్ అవారడ్స్ ప్రధానం చేశారు. గండ దీపం పుస్తకాన్ని ప్రముఖ కవి డాక్టర్ అంబటి సురేంద్ర రాజు ఆవిష్కరించారు.
ప్రముఖ జర్నలిస్టు రమేష్ హజారే పుష్పగిరి కవిత్వాన్ని విశ్లేషించారు. ఈ సందర్భంగా కవి డాక్టర్ అంబటి సు రేంద్ర రాజు మాట్లాడుతూ జీవిత అనుభవాలను కవిత్వంగా రాశారని పేర్కొన్నారు. తెలు గు సాహిత్యంలో ఆధునికంగా వినిపిస్తున్న గొప్ప కవుల జాబితాలో పుష్పగిరి కూడా వారి సరసన నిలబడే గొప్ప కవిత్వాన్ని రాస్తున్నాడని ప్రశంసించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని, సాంస్కృతిక సంపదను సామాజిక తాత్వికతను కవి పలికిం చాడని అన్నారు. సంక్లిష్ట ప్రస్తుత సందర్భంలో ఈ కవిత్వం కీలక మలుపని, ఓ మైలురాయి అని పేర్కొన్నారు. వృత్తి కులాల ఐక్యతకు ఈ కవిత్వం ప్రతీకగా నిలుస్తుంది అన్నారు.
లైబ్రరీలో ఈ పుస్తకం ఉండాలని, ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండాలని, ఈ కవిత్వం పై విస్తృతం గా చర్చ జరగాలన్నారు. రమేష్ హజారే మాట్లాడుతూ తెలంగాణ మలి ఉద్యమ పోరాటంలో సకలజనులు చైతన్యమై పోరుసలిపారని, ఇప్పుడు సాధించుకున్న హక్కు లను కాపాడుకునేందుకు ఉద్యమించాలని పిలుపుని చ్చారు.ఈ కార్యక్రమంలో క్రైమ్ బ్రాంచ్ ఏసిపి కే. కిరణ్ కుమార్ ఆచారి, కొండపి గణేష్ బాబు, డాక్టర్ కే ఎన్ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.