17 August, 2026 | 4:57 AM

వాజ్‌పేయి జీవితం చిరస్మరణీయం

17-08-2026 12:00 AM

నిర్మల్ ,ఆగస్టు 16 ( విజయ క్రాంతి): దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జీవితం ఆదర్శనీయమని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. వర్ధంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సేవకు అంకితమైన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని కొనియాడారు.

రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవలో నిబద్ధతకు వాజ్ పేయి నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశ అభివృద్ధి, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వాజ్ పేయి ఆదర్శాలు, స్ఫూర్తి భారత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ముత్యం రెడ్డి,  శ్రీనివాస్ , రావుల రామనాథ్, రమణారెడ్డి చందు తదితరులు పాల్గొన్నారు.