1 April, 2026 | 1:06 AM

గొంతులో ఇరుకున్న మటన్ బొక్క..

15-05-2024 04:34 PM

యాదాద్రి భువనగిరి: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులు 66 ఏళ్ల  ఏళ్ల వృద్ధుడుకి గొంతులో ఇరుకున్న మటన్ బొక్కను విజయవంతంగా తొలగించారు. యాదాద్రి జిల్లా కక్కిరెన్ గ్రామానికి చెందిన శ్రీరాములు మటన్ తింటూ ప్రమాదవశాత్తూ 3.5 సెంటీమీటర్ల బొక్కను మింగేశాడు. వైద్య పరీక్షల్లో మొదట్లో అతనికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని తప్పుగా నిర్ధారణ అయింది. దీంతో శ్రీరాములు కామినేని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. అక్కడ ఎండోస్కోపీ అసలు విషయం బయటపడింది. డాక్టర్ నెట్టాలా ఆమె బృందం బొక్క కీలక అవయవాలకు సమీపంలో ఉన్నందున జాగ్రత్తగా నావిగేట్ చేస్తూ ఎముకను విజయవంతంగా తొలగించారు. శ్రీరాములుకి ద్రవ ఆహారం తీసుకోవాలని సూచించామని వైద్యులు తెలిపారు.