1 April, 2026 | 2:33 AM

చెట్టును ఢీకొన్న కారు.. వృద్ధ దంపతులు స్పాట్ డెడ్

15-05-2024 04:17 PM

ఖమ్మం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం హోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బోనకల్ మండలం ముష్టికుంట్ల సమీపంలో ప్రమాదవశాత్తు కారు చెట్టుకు ఢీకొని వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వృద్ధ దంపతులు ఖమ్మం మామిళ్ళగూడెంకు  చెందిన కొత్తూరు సత్యనారాయణ రుక్మిణిగా గుర్తించారు. కారు చెట్టును ఢీకొనటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.