31 March, 2026 | 11:37 PM

వినాయకనగర్‌ను వణికిస్తున్న దొంగ

16-05-2024 12:40 AM

వరుసగా కానిస్టేబుల్, సీఐ ఇండ్లల్లో దొంగతనం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

సిద్దిపేట, మే 15 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఒకే ఒక్క దొంగ వరుస దొంగతనాలకు పాల్పడుతూ కాలనీవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇదే కాలనీలో పలు ఇండ్లల్లో దొంగతనం జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ బాధితులేవరు పోలీసులను ఆశ్రయించక పోవడం వల్ల ఎవరి ఇంట్లో దొంగతనం జరిగిందో తెలియడం లేదు. వారం రోజుల క్రితం వినాయకనగర్ రెండో వీధిలో ఎక్సైజ్ కానిస్టే బుల్ ఇంట్లో రూ. 80వేలు నగదు దోచుకెళ్లినట్టు బాధిత కానిస్టేబుల్ సిద్దిపేట త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరిగిన (సోమవారం) రోజున అర్ధ రాత్రి దాటక ఇదే కాలనీలోని భారతీ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఎక్సైజ్ సీఐ ఇంట్లో చోరబడి 10తులాల బంగారం, రూ. 10వేల నగదు దోచుకెళ్లాడు. బాధిత అధికారి మంగళవారం త్రీ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విద్యాసాగర్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుం టామని చెప్పారు.