03-12-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 2: అభివృద్ధికి సహకరించండి మీరు చేసిన సహాయం మీతోపాటు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు జరుగుతుంది... ఎవరికివారు ఈ స్థలాలు మావే అనుకుంటే అభివృద్ధి ఎక్కడ జరగదు పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వానికి సహకరించి వేగవంతంగా అభివృద్ధి పలాలను పొందెందుకు సహకారం అందించాలంటూ నిత్యం నేతలతో పాటు అధికారులు సైతం భూ సేకరణతో పాటు తదితర ముఖ్యమైన సందర్భాలలో చెబుతుంటారు. ఇలా చెప్పడం తప్పేమీ కాదు ప్రజలు అందుకు ఒప్పుకొని సహకరించడం మరింత మంచిదే.
కట్టుకున్న గూడు లను విడిచిపెట్టి అభివృద్ధికి సహకరిస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి సహకరించిన పేదలకు ఆశించిన మేరకు న్యాయం మాత్రం జరగడంలేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి దగ్గర రెండవ ఆర్‌ఓబి నిర్మించేందుకు ఆ ప్రాంతవాసులు ఇండ్లను నివాస ప్రాంతాలను కోల్పోయారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం అటువైపు చూడడమే మానేశారని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.
పట్టాలు చేతికిచ్చి స్థలం చూపకుంటే ఎట్లా?
ఎగిర రెవెన్యూ వార్డులో 372 సర్వే నెంబర్లలో మీకు ప్లాట్లు ఇస్తున్నామంటూ 2023 సంవత్సరంలో పత్రాలు చేతికిచ్చి ఇక సంతోషంగా జీవించాలంటూ చెప్పడం వెనుక ఉన్న అంతర్వేమిటో అధికారులు చెప్పాలని అప్పలపల్లి గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. స్థలం చూపకుండా పట్టాలు ఇచ్చి మా పని అయిపోయిందన్నట్లు చేస్తే ఇండ్ల నిర్మాణం ఎక్కడ చేసుకోవాలని అప్పనపల్లి లో ఇండ్లు కోల్పోయిన ఆ ప్రాంతావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలోనే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలిసి క్యాంపు కార్యాలయంలో తమ ఆవేదనలో కూడిన వినతిపత్రం సమర్పించ డంతో ఈ సమస్య ఎంత జట్టిలంగా ఉందో వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడంతో అప్పనపల్లి వాసులు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించాలని వేడుకుంటున్నారు.