గాడిద పాలకు భలే మంచి డిమాండ్.. లీటర్ 5000
03-05-2026 01:33 PM
బోథ్,(విజయక్రాంతి): పసిపిల్లలకు దగ్గు, పెద్దలకు దమ్ము కోసం దివ్య ఔషధంగా పనిచేసే గాడిదపాలు గ్రామాల్లో విక్రయిస్తున్నారు. 10 ఎంఎల్ బాటిల్ లో విక్రయించే గాడిద పాలు 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గాడిద పాలకు డిమాండ్ ఉండడం వల్ల మహారాష్ట్ర నుండి గాడిదల పెంపకం దారు లు వచ్చి పాలను విక్రయిస్తున్నారు. లీటరు పాలను ఐదువేల వరకు ఆదాయం వస్తుందని గాడిద పాల విక్రయం దారులు అంటున్నారు. గాడిద పాలకు భలే డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు






