2 July, 2026 | 3:11 AM

మేకల మందపై కుక్కల దాడి

02-07-2026 01:56 AM

చేవెళ్ల మున్సిపాలిటీలో ఘటన 18 మేకలు మృతి

చేవెళ్ల, జూలై 1 (విజయక్రాంతి): చేవెళ్ళ మున్సిపాలిటీలో వీధి కుక్కలు మేకల మందపై దాడి చేశాయి. మంగళవారం అర్ధరాత్రి చేవెళ్ల గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య మేకల మందపై కుక్కలు గుంపుగా దాడి చేసి, 18 మేకల  కొరికి చంపాయి. మందలో మిగిలిన 200 గొర్రెలు ప్రాణభయంతో పసుల కాపరి కిష్టయ్య ఇంటివైపు పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నాయి. విషయం తెలుసుకున్న చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ సమత వెంకటరెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్ సంఘటనా స్థలానికి పరిశీలించారు. బాధితుడు కిష్టయ్యను పరామర్శించి, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.