2 July, 2026 | 3:30 AM

వీబీ జీ రామ్ జీ పేరు వద్దు.. పాతపేరునే కొనసాగించాలని ఆందోళన

02-07-2026 01:58 AM

దామరచర్ల, జులై 1: గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరును విబిజి రామ్ జీ గా పేరు మార్చొద్దని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దామరచర్ల మండలం రైతు సంఘం అధ్యక్షులు మాలోతు వినోద్ నాయక్ మాట్లాడుతూ 2006 నుండి 2026 వరకు దేశంలోని సుమారు 18 కోట్ల మంది నిరుపేద కుటుంబాలు ఉపాధిని చూపిస్తూ వారికి జీవనోపాధిగా ఉన్న గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత కొంత కోత విధిస్తూ వస్తుందని ఆరోపించారు.

నేడు ఆ పేరునే వి బి జి రామ్ గా మార్చేసి క్రమ క్రమంగా చట్టాన్ని పూర్తిగా తీసివేసే ఆలోచన ను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. తక్షణమే ఆలోచనని వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దయానంద్, సుభాని, రవి, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి, కాజా మొహిద్దిన్, వెంకటయ్య గిరిజన సంఘం నా యకులు పాపా నాయక్ , శ్రీను విజయ్, వ్య వసాయ కార్మిక సంఘం నాయకులు హనుమంతు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు