31-12-2025 01:14:48 AM
టెహ్రాన్, డిసెంబర్ ౩౦: ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలింది. గతంలో ఎన్నడూ లేనంతగా కరెన్సీ ‘రియాల్’ విలువ పాతాళానికి పడిపోయింది. మూడేళ్ల కిత్రం ఒక డాలర్ విలువ అక్కడ 32,000 రియాల్స్‌గా ఉండగా, తాజాగా ఒక డాలర్ విలువ ఆ దేశంలో 1.4 మిలియన్లకు (౧౪ లక్షలు) చేరుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మొహమ్మద్ రెజా ఫర్జిన్ తన పదవికి రాజీనామా చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు 72 శాతం, వైద్య ఖర్చులు 50 శాతం పెరిగాయి. ద్రవ్యోల్బణం 42 శాతానికి చేరకుంది. 2018లో అణు ఒప్పందం నుండి అమెరికా తప్పుకున్నప్పటి నుంచి ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు తీవ్రమయ్యాయి. దీంతో క్రమంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతూ వస్తోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.