ఒడిబియ్యంతో అన్నదానం..
20-08-2026 12:00 AM
సికింద్రాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): న్యూ బోయినపల్లి బాపూజీనగర్ లోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో బుధవారం ఆలయకమిటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ బోనాల జాతర సందర్భంగా భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ సమర్పించిన ఒడి బియ్యంతో ఆలయ కమిటీ అన్నదానం నిర్వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుర్గయ్య, ప్రేమ్ ముదిరాజ్,అజిత్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






