20 August, 2026 | 3:17 AM

భీమేశ్వరాలయంలో శాశ్వత పూజల డొనేషన్ కౌంటర్లు

20-08-2026 12:00 AM

వేములవాడ, ఆగస్టు 19, (విజయ క్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో శాశ్వత పూజల డొనేషన్ కౌంటర్లను బుధవారం ఏర్పాటు చేశా రు. డొనేషన్ కౌంటర్, ప్రోటోకాల్ కార్యాల యం పక్కన ప్రచార శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ఈ కౌంటర్లను ఆలయ ఈవో ఎల్ రమాదేవి, డీఈవో నవీన్కుమార్, ఈ ఈ రాజేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,

వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కౌంటర్లకు శుభారంభం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈవో ఎల్. రమాదేవి రూ.1,116, ఈఈ రాజేష్ రూ.1,116 చొప్పున విరాళాలు అందజేసి తొలి డొనేషన్లు నమోదు చేయించారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలను దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో) పెరిక శ్రీనివాస్ వెల్లడించారు.