20 August, 2026 | 5:56 AM

సర్వం కల్తీ మయం!?

20-08-2026 12:00 AM
  1. నాణ్యత లేని ఆహార పదార్థాలు
  2. దాడులు చేసినా ఆగని కల్తీ దందా

కరీంనగర్, ఆగస్టు19(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించకుండా, అపరిశుభ్ర వాతావరణం లో ఆహార పదార్థాలను తయారు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి అధికారులు తనఖిలకే పరిమితమ్మవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పలు వ్యాపార సంస్థలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నా చర్యలు నామమాత్రమే అని చెప్పవచ్చు  ఫ్రిజ్లు సరిగా పనిచేయక ఫంగస్ పట్టిన సుమారు 600 ఐస్క్రీమ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించి ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.

రామడుగు మండలం మెగా ఇండస్ట్రీస్ సోయా చంక్స్ (మీల్ మేకర్స్) తయారీలో నిబంధనలకు విరుద్ధంగా పశువుల దాణాను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి అధికారులు దాడులు చేశారు.తాజా గా కరీంనగర్ టవర్ సర్కిల్ పరిధిలోని నిత్యం రద్దీగా ఉండే రాజు టీ స్టాప్లో నాణ్యత లేని నూనెను వాడుతున్నట్లు గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు.   మంగళవారం ప్రెస్ నోట్. జమ్మికుంట పట్టణంలో ఆహార భ ద్రత శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండూరు కాం ప్లెక్స్ ప్రాంతంలోని వివిధ కిరాణా హోల్సేల్ దుకాణాలు, గ్రెయిన్ మార్కెట్ రోడ్ ప్రాం తంలోని ఆయిల్ మిల్లులను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. సేకరించిన నమూనాలలో జమ్మికుంటలోని రెండు ఆయిల్ మిల్లులలో ఉత్పత్తి చేసిన వేరుశెనగ నూనె, శనగపప్పు, వేరుశెనగలు, అలాగే వివిధ రకాల కాన్ఫెక్షనరీ (మిఠాయి) ఉత్పత్తులు ఉన్నాయి.

సేకరించిన నమూనాలను విశ్లేషణ నిమిత్తం గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించనున్నారు. ప్రయోగశాల నివేదికలు అందిన అనంతరం, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 మరియు సంబంధిత నిబంధనల ప్రకారం ఆయా ఆహార వ్యా పార సంస్థలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

చర్యలు ఉంటాయా లేదా చూడాలి. గతంలోనూ శ్వే త, మైత్రి, ప్రతిమ వంటి పలు హోటళ్లు, స్వీట్ షాపులలో తనఖిలు చేసినపుడు కిచెన్ ఏరియాలు అపరిశుభ్రంగా ఉండటం, పురుగు పట్టడం, అనుమతికి మించి హానికరమైన ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడటాన్ని అధికారులు గుర్తించారు. తనిఖీలు బాగానే ఉన్నా ఎక్కడ సీజ్ చేసిన దాఖలాలు లేవు నోటీసులకే పరిమితం అవుతున్నారు. తోపుడు బంద్లే నయం.. పెద్ద హోటల్ కంటే తోపుడు బండ్లు నయం  అనే అభిప్రాయం ప్రజల్లో మూక్షంగా మధ్య, పెదత్రరగతి వర్గాల్లో వ్యక్తం అవుతుంది. 

పెద్ద హోటల్స్ కంటే తోపుడు బండ్లు (స్ట్రీట్ ఫుడ్ కారట్స్) చాలా వరకు మెరుగైనవి, ప్రయోజనకరమైనవిగా భావిస్తున్నారు. . తోపుడు బండ్లపై తయారు చేసే తినుబంట్లు ఎప్పటికప్పుడు తాజాగా వేడివేడిగా తయా రు చేస్తారు. నిల్వ ఉంచిన పదార్థాలు వాడే అవకాశం తక్కువ. సామాన్య ప్రజలకు కూ డా చాలా తక్కువ, రీజనబుల్ ధరల్లో ఆహా రం లభిస్తుంది. 

ఫుడ్ సేఫ్టి ఆడిజరులు దా డులు నిర్వహించినపుడు కొన్ని పెద్ద హోటళ్లలో కూడా రోజుల తరబడి ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పదార్థాలు వాడుతుండట, కాలం చెల్లిన ఆహార పదార్థాలు లభ్యం అవుతుండటంతో ప్రజ ల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. ఈ క్రనంలోనే బ్రేక్ ఫాస్ట్ కోసం తోపుడు బండ్ల వద్ద క్యూ కడుతున్నారు.