9 May, 2026 | 8:44 PM

శ్రీమరకత ఆత్మలింగేశ్వర ఆలయ నిర్మాణానికి విరాళం

09-05-2026 08:04 PM

అందజేసిన టిఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో గల శ్రీమరకత ఆత్మలింగేశ్వర  ఆలయ నిర్మాణం కొరకు కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు సంపత్ గౌడ్ 25001/-రూపాయలను విరాళంగా అందజేశారు. కామారెడ్డి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ అమ్మ చేతుల మీదుగా చెక్కును అందించినట్లు పెద్ద ఆత్మకూరు గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆత్మకూరు గ్రామంలో గల శ్రీమరకత ఆత్మలింగేశ్వర ఆలయ నిర్మాణానికి 25001/-రూపాయలు విరాళంగా అందించినందుకు వారి కుటుంబ సభ్యులకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆత్మకూరు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామస్తులు ఆవసుల సుదర్శన్, మల్లారెడ్డి, వసంత రెడ్డి ఉన్నారు.